Andhra Pradesh CM Jagan Mohan Reddy Launches ‘Amma Vodi’ Scheme

0

ప్రజా సంకల్పయాత్రలో ఎందరో అక్కాచెల్లెమ్మల కన్నీటి గాథలు విని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కదిలిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కులేకపోవడంతో.. కూలికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నామని, రోజూ రెండు పూటలా తినడమే కష్టమైన తమకు పిల్లల్ని బడికి పంపడం ఎలాగని వారంతా వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. వారి కష్టాల్ని చూసి చలించిపోయిన జగన్‌మోహన్‌రెడ్డి.. పిల్లల్ని చదివించలేని నిస్పహాయ స్థితిలో ఉన్న పేదతల్లులకు భరోసా ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఒక్కో తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తానని, పేదరికంతో చదువుకు పిల్లలు దూరమవడం ఇకపై ఉండదని హామీనిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాశ్యత పెంపే లక్ష్యంగా… అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6500 కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Amma Vodi

9-01-2020 చిత్తూరులో ప్రారంభించబోతున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ… మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా… ఇంటర్‌ వరకూ వర్తింపజేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారీ బడికి దూరం కాకూడదన్న ఆశయంతో వైఎస్‌ జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది తల్లులు తమ కన్నీటిని తుడిచిన అన్న జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ పిల్లల చదువుకు కొండంత భరోసాగా నిలిచిన సీఎంకు ఎన్నటికీ రుణపడి ఉంటామంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *