తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేస్తారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్‌ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపైనా చర్చిస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *